హైదరాబాద్ లో గుట్టురట్టు: కులం, మతం ఆధారంగా అండర్సన్ ఎగ్ డొనేషన్ రాకెట్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Hyderabad

హైదరాబాద్ లో భారీ అండర్సన్ ఎగ్ డొనేషన్ రాకెట్ గుట్టురట్టు అయిందని మల్కాజిగిరి పోలీసులు శనివారం తెలిపారు. ఏడు రాష్ట్రాల నుంచి పేద మహిళలను రిక్రూట్ చేసుకుని, కులం, మతం, రంగు, ఎడ్యుకేషన్ ఆధారంగా దంపతులకు ఎగ్స్ మ్యాచింగ్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రధాన నిందితుడు అమిత్ శర్మ మహిళా హాస్టల్స్ ముసుగులో ఈ అక్రమ దందాను నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ రాకెట్ తో సంబంధం ఉన్న ఐవీఎఫ్ కేంద్రాలపైనా ప్రత్యేకంగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.