'నీళ్లున్నా కన్నీరే మిగులుతున్నాయి': కొమురంభీమ్ జిల్లాలో రైతుల ఆగ్రహం
రిపోర్టర్: శివ
స్థలం: కొమురంభీమ్ ఆసిఫాబాద్
కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని గోలేటి రిజర్వాయర్లో పూర్తిస్థాయిలో నీరున్నా, ఎడమ కాల్వ గండిని నాలుగేళ్లుగా పూడ్చకపోవడంతో ఆయకట్టు రైతులకు సాగునీరు అందడం లేదు. కాంట్రాక్టర్ మధ్యలోనే పనులు వదిలేయడం, కాల్వల్లో పిచ్చిచెట్లు పెరగడంతో 800 ఎకరాల భూమిలో పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి లైనింగ్ పనులు పూర్తి చేసి సాగునీరు అందించాలని 300 మంది రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.