ఏపీలో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల: మూడు విడతల్లో పోలింగ్
రిపోర్టర్: గోపి
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకమైన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణ జరగనుందని పేర్కొన్నారు. నవంబర్ ఇరవై ఆరున తొలి విడత, నవంబర్ ఇరవై తొమ్మిదిని రెండో విడత, అలాగే డిసెంబర్ రెండున మూడో విడత పోలింగ్ నిర్వహించి అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.