స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ శ్రేణులు సిద్ధం కావాలి: కిల్లాడ సత్యనారాయణ పిలుపు

రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు స్థలం: నర్సీపట్నం

నర్సీపట్నంలో సోమవారం బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు ధైర్యంగా ముందుకు సాగాలని పార్టీ సీనియర్ నాయకులు కిల్లాడ సత్యనారాయణ పిలుపునిచ్చారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని ఆయన సూచించారు. విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ నియామకం శుభపరిణామమని పేర్కొన్నారు.