నిర్ణీత గడువులోగా యంగ్ ఇండియా పాఠశాల పనులను పూర్తి చేయాలి
రిపోర్టర్: SK
స్థలం: పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లాలోని రాకల్ దేవ్‌పల్లి, సుల్తానాబాద్‌లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. సుల్తానాబాద్‌లో అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని రెండు నెలల్లో పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.