ఓటర్ల సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు ఆదేశం
రిపోర్టర్: SK
స్థలం: పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో ఎస్ఐఆర్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు. నోటీసులు అందుకున్న ఓటర్లు సకాలంలో ఆధార పత్రాలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఓటర్ల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే సమయంలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేస్తూ అధికారులకు పలు కీలక సూచనలు జేశారు.