శ్రీకాళహస్తిలో రైతు సంఘం వర్క్‌షాప్.. కీలక నిర్ణయాలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తిలో శనివారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా వర్క్‌షాప్ ఘనంగా జరిగింది. జిల్లా అధ్యక్షుడు అంగేరి పుల్లయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, గత కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.
రైతు సభ్యత్వాన్ని విస్తృతం చేయడంతో పాటు, గ్రామ మరియు మండల కమిటీలను త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర కమిటీ సభ్యుడు పందికాళ్ల మణి దిశానిర్దేశం చేశారు.