తీరానికి ఆర్నబ్ తుఫాను ముప్పు: అధికారులను అప్రమత్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
రిపోర్టర్: అశోక్
స్థలం: అమరావతి
ఆర్నబ్ తుపాను గమనాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి తక్షణ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తీరప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన స్పష్టం చేశారు. విపత్తు నిర్వహణశాఖ, ఆర్టీజీఎస్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం, వరద ప్రవాహాల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు.