సంగం మండలంలో రికార్డు స్థాయి ఓటింగ్: గత ఎన్నికల గణాంకాలను వెల్లడించిన అధికారులు

రిపోర్టర్: గోపి స్థలం: సంగం

గత సార్వత్రిక ఎన్నికల్ లో సంగం మండల పరిధిలోని కేంద్రాల్ లో అత్యధిక పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉండగా, అత్యధిక పోలింగ్ కేంద్రాలు సంగం మండలంలోనే ఉన్నట్లు అధికారులు తెలిపారు. అనసూయనగర్ కేంద్రంలో అత్యధికంగా 94.89 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు స్పష్టం చేశారు. పల్లిపాలెంలో 94.48 శాతంతో రెండో స్థానంలో నిలిచిందని, రాబోయే పరిషత్తు పోరులోనూ ఇదే స్పూర్తిని ఓటర్లు కొనసాగించాలని అధికారులు పిలుపునిచ్చారు.