ఓట్ల చోరీ ఆరోపణలపై మౌనం ఎందుకుంటూ తెలుగు నేతలను నిలదీసిన కాంగ్రెస్
రిపోర్టర్: రాము
స్థలం: Andhra Pradesh
దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ ఆరోపణలపై ప్రశ్నిస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు పోరాటం సాగుతుంటే తెలుగు నాయకులు ఎందుకు మౌనం వహిస్తున్నారని AP Congress పేర్కొంది. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి ఓటు హక్కు ప్రజల గొంతుకగా నిలుస్తుందని తెలిపింది. ఆ కీలక హక్కుపై అనుమానాలు, ప్రశ్నలు తలెత్తినప్పుడు వెంటనే స్పందించి ప్రజల తరఫున నిలబడి అధికారిక సమాధానాలు కోరాల్సిన బాధ్యత నాయకులపై ఎంతైనా ఉందని స్పష్టం చేస్తూ ఏపీ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది.