భారత్ పౌరసత్వ నిబంధనలపై ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: India

భారత పౌరసత్వం పొందడంపై గ్రోక్ చాట్‌బాట్ ఇచ్చిన వివరణ వైరల్ కావడంతో ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ స్పందించారు. భారత్ వాస్తవిక దృక్పథంతో ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్య నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఐర్లాండ్ పౌరుడు భారత్‌లో పౌరసత్వం మరియు నివాస చట్టాల గురించి అడిగిన ప్రశ్నకు గ్రోక్ స్పష్టమైన నిబంధనలను వివరించగా, మస్క్ దానిని ప్రశంసించారు.