శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానంలో నేడే వరుణయాగం: హాజరుకానున్న శంకర్ రెడ్డి

రిపోర్టర్: మదన్ రాయల్ స్థలం: తిరుపతి అర్బన్

తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని ప్రముఖ శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ నిర్వాహకులు ప్రత్యేకంగా వరుణయాగం మరియు వరుణజపం నిర్వహించనున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు వర్ధిల్లాలని కోరుతూ చేపడుతున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి సత్యవేడు తెలుగుదేశం పార్టీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు.