కడపలో భారీగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు
రిపోర్టర్: రాము
స్థలం: Kadapa
వైఎస్ఆర్ కడప జిల్లాలో పోలీసుల ప్రత్యేక నిఘాలో భాగంగా భారీగా ఎర్రచందనం దుంగలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలిపారు. మన్నూరు, వీరబల్లి, ఖాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో సంయుక్త ఆపరేషన్ నిర్వహించి 87 ఎర్రచందనం దుంగలతో పాటు ఐదు వాహనాలు, తొమ్మిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ సమర్థవంతమైన చర్యను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అభినందించారని స్పష్టం చేశారు.