మద్యం దుకాణాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ గ్రామస్తుల వినతి: ఎక్సైజ్ అధికారులకు వినతిపత్రం సమర్పణ

రిపోర్టర్: Dinesh Panda స్థలం: పలాస

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం చిన్న గురుదాసుపురం జంక్షన్ వద్ద బెల్ట్ షాపులు, ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేయవద్దని పలు గ్రామాల ప్రజలు కోరారు. చిన్న గురుదాసుపురం, కొబ్బరి చెట్టులారు, చిన్నమామిడిమెట్టు గ్రామాల ప్రజలు బుధవారం కాశీబుగ్గ ఎక్సైజ్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. తమ గ్రామాలను పూర్తిగా మద్యరహితంగా మార్చుకుంటామని గ్రామసభలో ముందే ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నట్లు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.