సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ వేడుకలు: సిరికొండ కళాశాలలో విద్యార్థినుల నృత్యాలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: సిరికొండ
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని కామధేను జూనియర్ కళాశాలలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. కళాశాల ప్రాంగణంలో విద్యార్థినులు రంగురంగుల పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మలను కొలువుదీర్చి సాంప్రదాయ పాటలతో ఉత్సాహంగా ఆడిపాడారు. ఈ వేడుకల్లో ప్రిన్సిపాల్ పుష్పాల లక్ష్మీ నర్సయ్య, అధ్యాపకులు శ్రీవాణి, అఖిల, రుచిత, లత, ప్రశాంత్, నరేందర్, సందీప్, గజానంద్ పాల్గొని విద్యార్థులకు పండుగ విశిష్టతను వివరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.