పెందుర్తిలో ఘనంగా ఎంపీపీ మరియు ఎంపీటీసీల వీడ్కోలు సభ
రిపోర్టర్: సురేష్
స్థలం: అనకాపల్లి
అనకాపల్లి జిల్లా పెందుర్తి మండల ఎంపీపీ, ఎంపీటీసీల పదవీకాలం ముగిసిన సందర్భంగా బుధవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వీడ్కోలు మరియు సత్కార సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక నేత పంచకర్ల రమేష్ బాబు ప్రజాప్రతినిధుల సేవలను అభినందించారు. పదవీకాలం పూర్తి చేసుకున్న నాయకులకు ఘనంగా సన్మానం చేశారు. ఈ వీడ్కోలు కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.