ఢిల్లీ రామ్ లీలా వేడుకల్లో ముప్పై అడుగుల బొద్దింక దిష్టిబొమ్మ దహనం

రిపోర్టర్: కిరణ్ స్థలం: ఢిల్లీ

ఢిల్లీ రామ్ లీలా వేడుకల్లో ముప్పై అడుగుల బొద్దింక దిష్టిబొమ్మ దహనం చేయనుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారిందని నిర్వాహకులు తెలిపారు. శ్రీ కేశవ్ రామ్ లీలా సమితి అధ్యక్షుడు మరియు బీజేపీ ఎమ్మెల్యే అశోక్ గోయల్ మాట్లాడుతూ ఇది ఎలాంటి రాజకీయ ప్రేరేపిత చర్య కాదని స్పష్టం చేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా అపరిశుభ్రతను దహనం చేయడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అయితే పవిత్రమైన పండుగ వేదికల్లో రాజకీయాలను తీసుకురావడంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.