ఇరాన్‌తో యుద్ధంలో త్వరలోనే అమెరికా విజయం సాధిస్తుందన్న డొనాల్డ్ ట్రంప్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Washington
ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా అతి త్వరలోనే విజయం సాధిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఈ యుద్ధం ముగిసిన వెంటనే ద్రవ్యోల్బణం పూర్తిగా అంతరించిపోతుందని, పెట్రోల్ ధరలు కూడా భారీగా పడిపోతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, మధ్యప్రాచ్యంలో మరింత పెద్ద ముప్పును నివారించేందుకే తాము ఈ సైనిక చర్యను ప్రారంభించాల్సి వచ్చిందని వివరించారు. ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చలు మరియు సంప్రదింపుల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.