పారదర్శక ఈ వేలం కోసం నూతన భూ కొనుగోలు పోర్టల్
రిపోర్టర్: మదన్ రాయల్
స్థలం: తిరుపతి అర్బన్
ఆంధ్రప్రదేశ్ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నూతనంగా తెచ్చిన ఉమ్మడి భూ కొనుగోలు పోర్టల్ పై తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. టిడ్కో నిపుణులు సాయి పవన్, వినయ్ కుమార్ పోర్టల్ పనితీరును అధికారులకు వివరించారు. ప్రజలు ఇళ్ల వద్ద నుంచే ఈ-వేలంలో పాల్గొనేలా పారదర్శక విధానం తెచ్చినట్లు ఛైర్మన్ తెలిపారు.