అనారోగ్య కారణాల వల్ల కౌన్ బనేగా కరోడ్ పతి షూటింగ్ రద్దు

రిపోర్టర్: సురేష్ స్థలం: ముంబై

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అనారోగ్యం కారణంగా ప్రసిద్ధ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్ పతి షూటింగ్ వాయిదా పడినట్లు ప్రముఖ వార్తా సంస్థ ఐఏఎన్ఎస్ వెల్లడించింది. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కొత్త ఎపిసోడ్ల ఫిలిమింగ్ తాత్కాలికంగా నిలిచిపోయిందని, త్వరలోనే ఆయన కోలుకుని తిరిగి షూటింగ్ లో పాల్గొంటారని సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి.