ఏపీలో చిరు వ్యాపారులకు బ్యాంకుల నుంచి ప్రత్యేక క్రెడిట్ కార్డులు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: ఆంధ్రప్రదేశ్

పీఎం స్వనిధి పథకం లబ్ధిదారులైన ఏపీలోని చిరు వ్యాపారులకు బ్యాంకులు ప్రత్యేక క్రెడిట్ కార్డులు జారీ చేయనున్నాయి. వ్యాపార పెట్టుబడుల కోసం కనిష్ఠంగా రూ.10 వేల నుంచి గరిష్ఠంగా రూ.30 వేల వరకు వీటిని వినియోగించుకోవచ్చు. కేవలం వ్యాపార అవసరాలకే ఈ కార్డులు అనుమతిస్తారు. ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల బెడద నుంచి చిరు వ్యాపారులను రక్షించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.