సెల్లార్లను దుకాణాలుగా మార్చడంతో పట్టణాల్లో తీవ్రమవుతున్న ట్రాఫిక్ ముప్పు
రిపోర్టర్: గోపి
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లాలోని ప్రధాన పట్టణాలలో నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లను దుకాణాలుగా మారుస్తున్నారని, దీనివల్ల వాహనాలు రోడ్లపైనే పార్కింగ్ చేయాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బొబ్బిలి, రాజాం, విజయనగరంలలో వందలాది వాణిజ్య భవనాల్లో పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతోనే యజమానులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని, అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు డిమాండ్ చేస్తున్నారు.