మంథనిలో గణపతి సచ్చిదానంద స్వామీజీ పర్యటన: భారీ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడి
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: మంథని
మంత్రి శ్రీధర్ బాబు చొరవతో రేపు మంథని నియోజకవర్గానికి శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ విచ్చేయనున్నట్లు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు తెలిపారు. మంథని పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ధన్వాడ మరియు మంథని ప్రాంతాల్లో జరిగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామీజీ దివ్య దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందాలని పిలుపునిచ్చారు.