అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుపై అమెరికా ఆంక్షలు: ట్రంప్ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా కలకలం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: వాషింగ్టన్
అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆంక్షలు విధించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అమెరికా పౌరులపై విచారణ జరిపే అధికారం ఐసీసీకి లేదని, కోర్టు కార్యకలాపాలను అడ్డుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో స్పష్టం చేశారు. అయితే అమెరికా చర్యలను ఐసీసీ తీవ్రంగా వ్యతిరేకించిందని, ఇది అంతర్జాతీయ న్యాయ వ్యవస్థ పునాదులపై దాడి వంటిదని డిప్యూటీ ప్రాసిక్యూటర్ నజాత్ షమీమ్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేసినట్లు మీడియా వెల్లడించింది.