రాజన్న సిరిసిల్లలో పాదయాత్రలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
రిపోర్టర్: వెంకట్
స్థలం: Rajanna Sircilla
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అంబేద్కర్ చౌరస్తా నుండి సభా వేదిక వరకు నిర్వహించిన పాదయాత్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ మేరకు తెలంగాణ సీఎంవో అధికారికంగా ట్వీట్ చేస్తూ వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘన స్వాగతం పలికారు. ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఈ పాదయాత్ర చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. యాత్ర సాగిన దారి పొడవునా ప్రజలు తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా వాటిని పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.