గోదావరి నదిలో నీరు లేక విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారన్న తెలుగు స్క్రైబ్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Ramagundam

రామగుండం వద్ద గోదావరి నదిలో నీరు లేకపోవడంతో వినాయక విగ్రహాలు కుప్పలా పేరుకుపోయాయని తెలుగు స్క్రైబ్ ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. హజూరాబాద్ నియోజకవర్గంలో నదిలో నీటి మట్టం పూర్తిగా పడిపోవడంతో అధికారులు జేసీబీలతో విగ్రహాలను పగలగొడుతున్నారని ఆ వెబ్ హ్యాండిల్ పేర్కొంది. ఈ ఘటనపై స్థానిక ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, దీనిపై తక్షణమే అధికారులు స్పష్టతనివ్వాలని పలువురు కోరుతున్నారు.