ఫ్లైదుబాయ్ విమాన ముప్పు తప్పించిన కెప్టెన్: అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం

రిపోర్టర్: రాజేష్ స్థలం: న్యూజెర్సీ

ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ దాడిని దీటుగా ఎదుర్కొని విమానం కూలిపోకుండా కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్కు మద్దతుగా ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా ప్రతినిధుల సభ మచ్చర్ను గౌరవిస్తూ ఓ ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టిందని జోష్ గాట్హైమర్ తెలిపారు. ఆ సమయంలో పైలట్తోపాటు సిబ్బంది, ప్రయాణికులు అత్యంత ధైర్యసాహసాలను ప్రదర్శించారని వారు కొనియాడారు. సెప్టెంబర్ 30వ తేదీన జరిగిన ఈ విమాన ప్రమాద ఘటనను వారు తీవ్రంగా ఖండించారు.