వైజాగ్ అమ్మాయి ఘనత: ఉమెన్ గ్రాండ్మాస్టర్గా సాహితి వర్షిణి ఎంపిక

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Visakhapatnam

భారత చెస్ క్రీడా రంగంలో విశాఖపట్నానికి చెందిన యువ క్రీడాకారిణి సాహితి వర్షిణి మూగి అరుదైన మైలురాయిని అందుకున్నట్లు ఆమె తండ్రి, కోచ్ లోకేశ్వర మూగి రావు వెల్లడించారు. సెర్బియాలో జరిగిన రౌండ్ రాబిన్ టోర్నమెంట్లో అద్భుత ప్రతిభ కనబరిచి మూడో నార్మ్ను సాధించడం ద్వారా ఆమె సరికొత్త చరిత్ర సృష్టించారని తెలిపారు. చిన్నతనంలో డెంగ్యూ బారిన పడి చావు తప్పించుకుని బయటపడిన సాహితి, పట్టుదలతో ఈ స్థాయికి చేరుకున్నట్లు ఆయన గర్వంగా పేర్కొన్నారు.