భారత్‌లో త్వరలో విడుదల కానున్న ఒప్పో కే14 ప్లస్ 5జీ

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: India

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో త్వరలో భారత్‌లో ఒప్పో కే14 ప్లస్ 5జీ ఫోన్‌ను విడుదల చేయనుంది. ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక మైక్రోసైట్ ద్వారా ఈ ఫోన్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. పవర్ అండ్ డ్యూరబిలిటీ ప్రధానాంశంగా ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రానుండగా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, లాంచ్ తేదీని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.