మక్తల్ ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి వాకిటి శ్రీహరి
రిపోర్టర్: శివ
స్థలం: నారాయణపేట
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో ఈనెల 24న గురువారం జరగనున్న వినాయక నిమజ్జన ఏర్పాట్లను ఆదివారం ఉదయం మంత్రి వాకిటి శ్రీహరి అధికారులతో కలిసి మినీ ట్యాంక్ బండ్ వద్ద పరిశీలించారు. చెరువులో నీటిమట్టం తక్కువగా ఉన్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ వినీత్ సూచనల మేరకు మున్సిపల్, విద్యుత్, పోలీసు అధికారులను మంత్రి ఆదేశించారు.