జాతీయ రహదారిపై లారీ బోల్తా: వేగంగా ఢీకొన్న రెండు కార్లు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: జోగులాంబ గద్వాల
జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై లారీ అదుపుతప్పి బోల్తా పడినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ ఘటనలో లారీ వెనుక వస్తున్న రెండు కార్లు వేగంగా ఒకదానికొకటి ఢీకొనడంతో పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యాయి. కార్లలో ఎయిర్ బ్యాగులు వెంటనే తెరుచుకోవడంతో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని, దీంతో పెను ప్రమాదం తప్పిందని ఆయన వెల్లడించారు. ఈ రోడ్డు ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై సుమారు అరగంట పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది.