గణేష్ ఉత్సవాల విజయవంతానికి సహకరించిన అందరికీ పోలీస్ కమిషనర్ కృతజ్ఞతలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: నిజామాబాద్ రూరల్
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ విగ్రహాల ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకు ఉత్సవాలు ప్రశాంతంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య కృతజ్ఞతలు తెలిపారు. కమిషనరేట్ పరిధిలో మొత్తం 5,811 గణేష్ విగ్రహాలు ప్రతిష్ఠించగా, వివిధ శాఖల అధికారులు, నిర్వాహకులు, ప్రజలు అందించిన సహకారం ఎంతో అభినందనీయమని ఆయన వెల్లడించారు.