వంట నూనెల దిగుమతి సుంకం భారీగా తగ్గించిన కేంద్ర ప్రభుత్వం

రిపోర్టర్: అశోక్ స్థలం: న్యూఢిల్లీ

రాబోయే పండుగల సీజన్ను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వంట నూనెల దిగుమతి సుంకాలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుందని అధికారులు తెలిపారు. సన్ఫ్లవర్, పామాయిల్, సోయాబీన్ నూనెలపై కస్టమ్స్ డ్యూటీని కుదించినట్లు పేర్కొన్నారు. క్రూడ్ సన్ఫ్లవర్ ఆయిల్పై పన్నును పూర్తిగా తొలగించి సున్నాకు తగ్గించగా, రిఫైన్డ్ నూనెలపై కూడా సుంకాలను సవరించినట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల మార్కెట్లో వంట నూనెల ధరలు తగ్గుముఖం పట్టి పేద, మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఊరట లభిస్తుందని వివరించారు.