కావలి సర్వాయపాలెం పాఠశాలలో విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ మరియు మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్

రిపోర్టర్: వెంకట్ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లా కావలి మండలం సర్వాయపాలెం జడ్పీహెచ్ఎస్లో మంగళవారం కెరీర్ గైడెన్స్ మరియు మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా సమగ్ర శిక్ష విభాగం ఆదేశాల మేరకు కౌన్సిలర్ మేరీ సుజనా ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. మాదకద్రవ్యాల నిర్మూలన, ఆత్మహత్య నివారణ, మానసిక ఒడిదుడుకులను ఎదుర్కొనే విధానంపై ఆమె అవగాహన కల్పించారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.