పంటలు పశువులు కళకళలాడాలని గ్రామస్తుల ప్రత్యేక పూజలు
రిపోర్టర్: Gone Rachana
స్థలం: దస్తురాబాద్
నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని ఆకొండపేట గ్రామంలో గురువారం పోలాల అమావాస్య పండుగను నేతకాని కులస్తులు అత్యంత ఘనంగా నిర్వహించారు. పండుగ సందర్భంగా గ్రామ పక్కనే ఉన్న చెరువు నుంచి పవిత్రమైన మట్టిని సేకరించి ఎడ్ల ప్రతిమలను తయారు చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఊరంతా ఊరేగింపు నిర్వహించి ప్రతిమలను చెరువులో నిమజ్జనం చేశారు. ఇలా చేయడం వల్ల పశుసంపదృద్ధి చెంది, పంట పొలాలు బాగా పండుతాయని గ్రామస్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ కార్యక్రమంలో వివిధ కులాల పెద్దలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.