రైలులో ప్రయాణికుడి బహిరంగ మద్యం సేవన వీడియో కలకలం
రిపోర్టర్: సునీల్
స్థలం: Mumbai
మహారాష్ట్రలోని విరార్ నుంచి చర్చ్‌గేట్ వెళ్తున్న స్థానిక రైలులో దివ్యాంగుల కోచ్ వద్ద ఓ ప్రయాణికుడు గాజు సీసాలో బహిరంగంగా మద్యం తాగుతూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సోమవారం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలకు విరార్ స్టేషన్లో ఈ సంఘటన జరిగిందని రైల్వే పోలీసులు తెలిపారు. ఎదురుగా ఉన్న ఫ్లాట్‌ఫాంపై ఉన్న మరో ప్రయాణికుడు దీన్ని మొబైల్లో రికార్డ్ చేసి సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేయడంతో ప్రయాణికుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.