యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఫ్రీ ట్రేడ్ ఒప్పందాలు

రిపోర్టర్: కిరణ్ స్థలం: ന്യൂഡൽഹി

భారత్ గత కొద్ది సంవత్సరాలలో దాదాపు 40 దేశాలతో ఫ్రీ ట్రేడ్ ఒప్పందాలు చేసుకుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ ఒప్పందాలు దేశంలోని యువతకు కొత్త అవకాశాల ద్వారాలు తెరుస్తున్నాయని పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలకు నూతన భాగస్వామ్యాలు ఏర్పడటంతో పాటు విదేశీ మార్కెట్లలో కొత్త మార్గాలు సుగమమవుతున్నాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.