బెల్లంపల్లి మండపాల్లో సీపీ అంబర్ కిషోర్ ఝా ప్రత్యేక పూజలు
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
బెల్లంపల్లి పట్టణంలోని వివిధ గణేష్ మండపాలను రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా శనివారం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిమజ్జన ఏర్పాట్లపై నిర్వాహకులతో ఆరా తీశారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అనంతరం నిర్వాహకులు సీపీని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి, రూరల్ ఇన్స్పెక్టర్ హనోక్ పాల్గొన్నారు.