హైవేపై లారీ బీభత్సం: వ్యాన్ క్యాబిన్ లో ఇరుక్కుని డ్రైవర్ దుర్మరణం

రిపోర్టర్: సునీల్ స్థలం: దేవరపల్లి

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దేవరపల్లి మండలం కొత్తగూడెం జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున నిద్రమత్తులో ఉన్న ఐషర్ వ్యాన్ డ్రైవర్ తుహిన్ శర్మ ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన డ్రైవర్ క్యాబిన్లోనే ఇరుక్కుపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో క్లీనర్ కు స్వల్ప గాయాలు కావడంతో వెంటనే గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.