అసెంబ్లీ ఘటనపై హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ అసెంబ్లీ వద్ద ఇటీవల జరిగిన ఉద్రిక్తతపై హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్యేలను అడ్డుకోవద్దన్న ఉత్తర్వులను సవరించాలని ఏజీ సుదర్శన్ రెడ్డి కోరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిబంధనలు ఉల్లంఘించి మహిళా పోలీసులపై దాడి చేశారని తెలిపారు. సభను నడిపే పూర్తి అధికారం స్పీకర్‌కే ఉంటుందని హైకోర్టు పేర్కొంది. శాంతిభద్రతల పరిరక్షణ కోసమే పోలీసులు చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.