సోషల్ మీడియాలో అసభ్యకర కంటెంట్: బహిరంగంగా మద్యం సేవించిన ఇన్ఫ్లుయెన్సర్పై పోలీసుల చర్యలు

రిపోర్టర్: సతీష్ స్థలం: శ్రీ సత్యసాయి

సోషల్ మీడియాలో వ్యూస్ కోసం అసభ్యకర కంటెంట్ను పోస్ట్ చేస్తూ, బహిరంగంగా మద్యం సేవిస్తూ వీడియోలు సృష్టిస్తున్న వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తప్పవని శ్రీ సత్యసాయి పోలీస్ ఖాతా ద్వారా వెల్లడించారు. రాయలసీమ బిడ్డ పేరుతో గుర్తింపు పొందిన ఒక ఇన్ఫ్లుయెన్సర్ బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తూ, అసభ్య పదజాలంతో కూడిన వీడియోను ఆన్లైన్లో షేర్ చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ వ్యవహారంపై స్పందించిన సీఐ యువరాజు తక్షణమే అప్రమత్తమై సంబంధిత వ్యక్తిపై తగిన చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు.