విజయ్ దేవరకొండ రశ్మికల రణబాలి చిత్రం నుంచి ఏందయ్యా సామీ పాట విడుదల తేది ప్రకటన

రిపోర్టర్: రమేష్ స్థలం: హైదరాబాద్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం రణబాలి. బ్రిటీష్ పాలనా కాలం నాటి చారిత్రక నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలోని ఏందయ్యా సామీ ఫస్ట్ సింగిల్ ను సెప్టెంబర్ 21న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అక్టోబర్ 16న విజయదశమి కానుకగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.