నారాయణపేట మోడల్ స్కూల్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం

రిపోర్టర్: అశోక్ స్థలం: నారాయణపేట

నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో ఫుడ్ పాయిజన్ అయింది. మధ్యాహ్న భోజనం వికటించడంతో ముప్పై మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర కడుపునొప్పి రావడంతో అప్రమత్తమైన సిబ్బంది, పదిహేను మంది విద్యార్థినులను మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.