సింగరేణి బొగ్గు కేటాయింపులపై అబద్ధాలంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై బీఆర్ఎస్ ధ్వజం

రిపోర్టర్: రాము స్థలం: Hyderabad

సింగరేణి బొగ్గు కేటాయింపులపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమని బీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తారు. రెండేళ్ల క్రితమే యాదాద్రి పవర్ ప్లాంట్కు సింగరేణి నుంచి జి-9 బొగ్గు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ఇప్పటికీ సింగరేణిలోని పదమూడు గనుల్లో అదే బొగ్గు ఉత్పత్తి కొనసాగుతోందని స్పష్టం చేశారు. సింగరేణి వార్షిక నివేదికలోనూ ఇదే స్పష్టంగా ఉందంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.