చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో ఘనంగా నివాళులర్పించిన ఎస్పీ
రిపోర్టర్: సతీష్
స్థలం: నాగర్ కర్నూల్
తెలంగాణ రైతాంగ పోరాట యోధురాలు, వీరవనిత చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించినట్లు ఎస్పీ నాగర్ కర్నూల్ (SP Nagarkurnool) వెల్లడించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఐపీఎస్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ చేసిన పోరాటాలు, ఆమె చూపిన ధైర్యసాహసాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించారు.