వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటన: విద్యార్థిని గోపిక శస్త్రచికిత్స విజయవంతం
రిపోర్టర్: రాజేష్
స్థలం: అనంతపురం
అనంతపురం జిల్లా రాప్తాడు ఉన్నత పాఠశాలలో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని గోపిక కుడి భుజానికి బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. భుజం ఎముకలు కలపడానికి గతంలో అమర్చిన సన్నని లోహపు తీగను వైద్య నిపుణుల బృందం తొలగించి విరిగిన ఎముకను సరిచేసి మెటల్ ప్లేట్ ను అమర్చారని, ప్రస్తుతం గోపిక ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతోందని ఆయన స్పష్టం చేశారు.