వైద్య విధాన పరిషత్ లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లపై సమీక్షా సమావేశం

రిపోర్టర్: ramesh chitty స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్ హైదరాబాద్ కోటి లోని వైద్య విధాన పరిషత్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో జరిగిన రివ్యూ మీటింగ్ లో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తో కలిసి పాల్గొన్నారు. రాష్ట్రంలో వైద్య విధాన పరిషత్ లోకి వచ్చే అన్ని డిపార్ట్మెంట్లలో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లపై సమీక్షా సమావేశం నిర్వహించి పలు సమస్యలపై అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది.