అమెరికా ట్రెజరీ సెక్రటరీపై నిరసనకారుల తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: రాము
స్థలం: వరల్డ్
అమెరికా హౌస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిటీ సమావేశంలో ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ విచారణను నిరసనకారులు తీవ్రంగా అడ్డుకున్నారు. ట్రంప్ ప్రభుత్వం ఇరాన్లో యుద్ధం చేస్తోందని ఆరోపిస్తూ ఆయనను 'యుద్ధ నేరస్థుడు' అంటూ నినాదాలు చేశారు. ఆంక్షలు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయని ప్లకార్డులు ప్రదర్శించారు. వెంటనే రంగంలోకి దిగిన క్యాపిటల్ పోలీసులు ఆందోళనకారులను బయటకు పంపించి వేశారు.