రైల్వేకోడూరు ఏపీఎన్జీవో తాలూకా ఉపాధ్యక్షుడిగా డాక్టర్ రమేష్ ఏకగ్రీవ ఎన్నిక
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: రైల్వే కోడూరు
అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులో జరిగిన ఏపీఎన్జీఓ జనరల్ బాడీ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం కోసం రాష్ట్ర నాయకత్వం చేస్తున్న కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తాలూకా నూతన వైస్ ప్రెసిడెంట్గా డాక్టర్ రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు హాజరై పలు సమస్యలపై చర్చించారు.