జంగారెడ్డిగూడెంలో భారీగా మత్తు ఇంజెక్షన్లు సీజ్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: ఏలూరు

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో యువతను మత్తుకు బానిసలుగా చేస్తున్న అక్రమ ఇంజెక్షన్ల నెట్‌వర్క్‌ను డ్రగ్ కంట్రోల్ అధికారులు, ఈగల్ టీమ్ సంయుక్తంగా ఛేదించాయి. లక్ష్మీ శ్రీనివాస్ మెడికల్ ఏజెన్సీపై దాడి చేసి, తనిఖీల భయంతో కార్పెంటరీ షాపులో దాచిన 7,550 ట్రెమడాల్ మత్తు ఇంజెక్షన్ వయల్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యాధికారులు హెచ్చరించారు.